ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కుల ప్రస్తావన ఎందుకు?: అనగాని - జగన్​పై అనగాని సత్యప్రసాద్ విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నేతల కులపిచ్చిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. ముఖ్యమంత్రి కుల జాడ్యం వదిలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

tdp mla anagani satyaprasad criticises cm jagan about cast issue
అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే

By

Published : Aug 20, 2020, 9:56 AM IST

ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి పదేపదే కుల ప్రస్తావన తేవడం బాధాకరమని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఒక సామాజికవర్గంపై కక్ష కట్టారని ఆరోపించారు. స్వర్ణ హోటల్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేశ్​ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాయపాటి మమతను విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు సామాజిక వర్గం వారు డాక్టర్లు, పోలీసులు, వ్యాపారవేత్తలు, రైతులుగా ఉండకూడదా అని నిలదీశారు.

అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులు అధికంగా ఉన్న అమరావతిని చంపేస్తున్నారన్న అయన రాజధానికి భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారని విమర్శించారు. నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులుండవు కానీ చట్ట ప్రకారం నడుచుకునే వారిని కుల ద్వేషంతో వేధిస్తున్నారన్నారు. వైకాపా నేతల కులపిచ్చిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. ముఖ్యమంత్రి కుల జాడ్యం వదిలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details