ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Marreddy అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను సీఎం ఆదుకోరా! తన వాళ్లను కాపాడే పనేనా!:మర్రెడ్డి

Marreddy Srinivasa Reddy Fire on Government: ముఖ్యమంత్రి జగన్ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సింది మానేసి, బాబాయ్ హత్య కేసు నుంచి తన వాళ్లను కాపాడే పనిలో బిజీగా ఉన్నాడని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 24, 2023, 4:41 PM IST

Updated : Apr 24, 2023, 5:13 PM IST

Marreddy Srinivasa Reddy Fire on Government: అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి.. అది మానేసి.. వివేకా హత్య కేసులో దోషుల్ని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నాడని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రైతులు వర్షాల నుంచి పంటల్ని కాపాడుకునేందుకు శ్రమిస్తే, సీఎం జగన్ మాత్రం బాబాయ్ హత్య కేసు నుంచి తన వాళ్లను కాపాడే పనిలో బిజీగా ఉన్నాడని ఆయన ఆక్షేపించారు.

వర్షాలకు తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మర్రెడ్డి డిమాండ్ చేశారు. పిడుగుపాటుకు గురై మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న అరటి, మామిడి, మిరప వంటి పలు పంటలను పండించే రైతుల్ని జగన్ ప్రభుత్వమే ఆదుకోవాలని పేర్కొన్నారు. రైతుల నుంచి మిర్చి ఉత్పత్తుల్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.

దీంతో పాటు మామిడి, మిరప రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నామని మర్రెడ్డి ధ్వజమెత్తారు. పంటల్ని కాపాడుకునేందుకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న మిరప రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రెండో కృష్ణుడు అంబటి రాంబాబు ఉపన్యాసాలు మానేసి.. రైతులకు నీళ్లిచ్చి పంటలు కాపాడటంపై శ్రద్ధ పెట్టాలని ఆయన హితవుపలికారు.

"అకాలవర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిన సీఎం జగన్.. వివేకాహత్య కేసులో దోషుల్ని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. రైతులు వర్షాల నుంచి పంటల్ని కాపాడుకునేందుకు శ్రమిస్తే.. సీఎం మాత్రం బాబాయ్ హత్య కేసు నుంచి తన వాళ్లను కాపాడే పనిలో బిజీగా ఉన్నాడు. అకాల వర్షాల కారణంగా తడిచి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పిడుగుపాటుకు గురై మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. అకాల వర్షాలతో దెబ్బతిన్న మామిడి, మిరప రైతుల్ని జగన్ ప్రభుత్వమే ఆదుకోవాలి. రెండో కృష్ణుడు అంబటి రాంబాబు ఉపన్యాసాలు మానేసి.. రైతులకు నీళ్లిచ్చి పంటలు కాపాడటంపై శ్రద్ధ పెట్టాలి." - మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు

రైతుల సమస్యలపై మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి న్యూస్

ఇవీ చదవండి:

Last Updated : Apr 24, 2023, 5:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details