తెదేపా 'చలో ఆత్మకూరు' నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు ఏపీ పర్యాటక అతిథి గృహానికి తరలించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును గృహ నిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి చలో ఆత్మకూరులో పాల్గొనేందుకు అమరావతి వస్తున్న హనుమంతరాయచౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఒంగోలులో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కరణం వెంకటేశ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నూజివీడులో తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 20 మంది తెదేపా కార్యకర్తలను నూజివీడు పీఎస్‌కు తరలించారు. ప్రకాశం జిల్లాలో తెదేపా నాయకులను గృహ నిర్బంధం చేయగా సత్తెనపల్లిలో 16 మంది తెదేపా నాయకులను బైండోవర్ చేశారు.
చలో ఆత్మకూరు... తెదేపా నేతల గృహ నిర్బంధం
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చలో ఆత్మకూరు కార్యక్రమం నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలుచోట్ల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో బైండోవర్లు చేశారు.
తెదేపా నేతల గృహ నిర్బంధం