మద్యం దుకాణాలను తక్షణమే మూసేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా నేతలు దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనాను అరికట్టాల్సిన ప్రభుత్వం దానిని మరింత విస్తృతం చేసేందుకే మద్యం దుకాణాలను తెరిచారని మహిళా నేతలు ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కంటే డబ్బుల మీదే ప్రభుత్వానికి ఎక్కువ ప్రేమ అని మహిళా నేతలు విమర్శించారు.
'ప్రజల ప్రాణాలకంటే.. డబ్బుల మీదే ప్రభుత్వానికి ప్రేమ ఎక్కువ' - మంగళగిరిలో మద్యం దుకాణాలు
రాష్ట్రంలో మద్యం దుకాణాలను తక్షణమే మూసేయాలని తెదేపా మహిళా నేతలు దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వారు దీక్ష చేపట్టారు.
tdp mahila leaders protest