ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడులో శాంతి భద్రతలను పరిరక్షించాలి: తెదేపా - పల్నాడులో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీకి వినతి

పల్నాడులో దళితులు, మైనార్టీలపై దాడులు ఆగటం లేదంటూ మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్సీ అశోక్ బాబులు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని దృష్టికి తీసుకువచ్చారు. శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

పల్నాడులో శాంతిభద్రతలను పరిరక్షించాలి: తెదేపా
పల్నాడులో శాంతిభద్రతలను పరిరక్షించాలి: తెదేపా

By

Published : Jul 6, 2020, 3:24 PM IST

పల్నాడులో శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ తెదేపా నేతలు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నిని కలిసి విజ్ఞప్తి చేశారు. పల్నాడులో దళితులు, మైనార్టీలపై దాడులు ఆగటం లేదంటూ మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్సీ అశోక్ బాబులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో పిన్నెల్లి, ఆత్మకూరు గ్రామాల్లో జరిగిన ఘటనలను ఎస్పీకి గుర్తుచేశారు. పల్నాడులో బడుగు, బలహీనవర్గాల ప్రజలు రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని...కొందరిని గ్రామ బహిష్కరణ చేశారని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. అలాంటి వారు గ్రామాలకు మళ్లీ చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మాచర్ల తెదేపా నేత చలమారెడ్డి కుమారుడిని అన్యాయంగా అరెస్టు చేశారని...అక్రమ కేసుల పేరుతో భయపెడుతున్నారని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడులో శాంతిభద్రతలను మళ్లీ చక్కదిద్దుతామని ఎస్పీ విశాల్ గున్ని హామీ ఇచ్చినట్లు నేతలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details