ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో తెదేపా నాయకుల ధర్నా - tdp leaderss protest at mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పీఎమ్​ఏవై గృహాలను వెంటనే లబ్ది దారులకు అందించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. గృహాలను లబ్దిదారులకు పంపిణీ చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు.

tdp leaderss  protest at mangalagiri
మంగళగిరిలో తెదేపా నాయకుల ధర్నా

By

Published : Aug 16, 2020, 11:43 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో గత ప్రభుత్వహయాంలో నిర్మించిన పీఎమ్​ఏవై గృహాలను వెంటనే లబ్ది దారులకు అందించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపో రోడ్డులో నిర్మించిన గృహా సముదాయం వద్ద తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. 1,728 గృహాలు నిర్మించిన అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా... సంవత్సరం దాటిపోయినా ఇంతవరకు లబ్దిదారులకు పంపిణీ చేయలేదని అన్నారు. గృహాలను లబ్దిదారులకు పంపిణీ చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు. రాజకీయ కక్షతో నిరుపేదలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details