ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై తెదేపా నేతల ఆందోళన - TDP leaders worried over demolition of NTR statue
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ గుంటూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ గుంటూరులో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. గుంటూరు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి... పూలమాలలతో అలంకరించి ఆందోళన నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విగ్రహాల తొలగింపును నిలిపివేయాలని.. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని తెదేపా నేతలు హెచ్చరించారు.