ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు డీజీపీని కలవనున్న తెదేపా నేతల బృందం - ycp rule

పల్నాడు గ్రామాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులకు సంబంధించి ప్రతినిధుల బృందం ఇవాళ డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనుంది. ఆత్మకూరు,పిన్నెల్లి తదితర గ్రామాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులు, దౌర్జన్యాలపై మానవ హక్కుల కమిషన్​, ఎస్సీ- ఎస్టీ కమిషన్​కు, మహిళా కమిషన్​కు ఫిర్యాదులు చేయనున్నారు. తెలుగుదేశం ఎంపీలతో కలిసి వెళ్లి కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే గవర్నర్ కు నేతల బృందం వినతిపత్రం అందజేయనుంది.

తెదేపా

By

Published : Sep 13, 2019, 4:18 AM IST

చలో అత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటంతో తదుపరి కార్యాచరణను తెలుగుదేశం సిద్ధం చేసుకుంటోంది. సీనియర్ నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశమైన చంద్రబాబు... ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెలుగుదేశం నేతల బృందం డీజీపీని స్వయంగా కలవనుంది. వైకాపా నేతల అరాచకాలపై వినతిపత్రం ఇవ్వటంతో పాటు, అన్ని ఆధారాలతో సహా ప్రచురించిన 2పుస్తకాలను డీజీపీకి అందజేయనున్నట్లు నేతలు తెలిపారు. ఆత్మకూరు,పిన్నెల్లి తదితర గ్రామాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులు, దౌర్జన్యాలపై మానవ హక్కుల కమిషన్​, ఎస్సీ- ఎస్టీ కమిషన్​కు, మహిళా కమిషన్​కు ఫిర్యాదులు చేయనున్నారు. తెలుగుదేశం ఎంపీలు, నేతలు కలిసి వెళ్లి కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే గవర్నర్​కు నేతల బృందం వినతిపత్రం అందజేయనుంది.

ABOUT THE AUTHOR

...view details