ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేద విద్యార్థుల సంక్షేమం కోసం టీఎన్​ఎస్​ఎఫ్ పోరాడటం నేరమా?' - టీఎన్​ఎస్​ఎఫ్ నేతల అరెస్ట్

గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ జైలు వద్ద టీఎన్​ఎస్​ఎఫ్ నేతలను తెదేపా నాయకులు పరామర్శించారు. జీఓ 77 ను రద్దు చేయాలంటూ సీఎం నివాసం ముట్టడికి యత్నించిన తెలుగునాడు విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టు శనివారం వారికి రిమాండ్ విధించింది.

tdp leaders visited sub jail at narasaraopeta
సబ్ జైల్ వద్ద విద్యార్థి నేతలను పరామర్శించిన తెదేపా శ్రేణులు

By

Published : Jan 24, 2021, 1:24 PM IST

సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్​ఎస్​ఎఫ్ నేతలకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించగా.. వారిని గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ ​జైలుకు తరలించారు. ఐదుగురు విద్యార్థి సంఘం నేతలను జైలు వద్ద తెదేపా నాయకులు పరామర్శించారు. విద్యార్థి సంఘ నేతలపై వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేద విద్యార్థుల సంక్షేమం కోసం టీఎన్​ఎస్​ఎఫ్ పోరాడటం నేరమా అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం విద్యార్థి సంఘం నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన వెంట తెదేపా నాయకులు కూరపాటి హనుమంతరావు , చదలవాడ అరవింద బాబు ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details