వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని తెదేపా నేతలన్నారు. వైకాపా నేతలు దాడి చేశారని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహమ్మద్ హనీఫ్‌ను గుంటూరులో తెదేపా నాయకులు పరామర్శించారు. వైకాపా ఆరాచక పాలన పరాకాష్టకు చేరిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసిర్ అహమ్మద్ అన్నారు.
మహమ్మద్ హనీఫ్‌ను పరామర్శించిన తెదేపా నేతలు - గుంటూరులో మహమ్మద్ హనీఫ్ ఆత్మహత్యాయత్నం వార్తలు
వైకాపా నేతలు దాడి చేశారని పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన మహమ్మద్ హనీఫ్‌ను గుంటూరు తెదేపా నేతలు పరామర్శించారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ కరువైందని తెదేపా నేతలు మండిపడ్డారు.
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ కరువైందన్నారు. తాడికొండ మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్న అధికారాలు పట్టించుకోవట్లేదని వాపోయారు. అనేకచోట్ల ముస్లిం మైనారిటీలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్పందించి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిని, మహమ్మద్ హనీఫ్పై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.మౌజమ్ ఆత్మహత్యాయత్నం...సెల్ఫీ వీడియో వైరల్