ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అరెస్టైన రైతు ఎక్కడున్నాడో చెప్పండి..!' - అమరావతి రైతుల ఆందోళన

ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి కేసులో అరెస్టైన రైతుకు సంఘీభావం తెలిపేందుకు తెదేపా నేతలు మంగళగిరి పోలీసు స్టేషన్​కు వెళ్లారు. రైతు రామ్మోహన్ రావు ఎక్కడున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్‌రావును చూపించే వరకూ స్టేషన్‌ వదిలి వెళ్లబోమని అక్కడే బైఠాయించారు.

Tdp leaders staged protest at mangalagiri police station
మంగళగిరి పీఎస్​లో తెదేపా నేతల బైఠాయింపు

By

Published : Jan 7, 2020, 11:30 PM IST

మంగళగిరి పీఎస్​లో తెదేపా నేతల బైఠాయింపు
గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి కేసులో అరెస్టైన రైతు రామ్మోహన్​రావును పరామర్శించేందుకు తెదేపా నేతలు మంగళగిరి పోలీసు స్టేషన్​కు వెళ్లారు.​ రామ్మోహన్​రావుకు సంఘీభావం తెలిపేందుకు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అక్కడికి వెళ్లారు. రామ్మోహన్ రావు ఎక్కడ ఉన్నారని పోలీసులను ప్రశ్నించారు. రైతును చూపించే వరకూ స్టేషన్ వదిలి వెళ్లబోమని బైఠాయించారు. రైతు నల్లపాడు పోలీసు స్టేషన్​లో ఉన్నారన్న సమాచారంతో నేతలు అక్కడికి వెళ్లారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details