రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెదేపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి సత్తెనపల్లి రోడ్డులోని కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు కొనసాగింది. అనంతరం నరసరావుపేటలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా నుంచి ప్రజలందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పెద్దలు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని జీవీ ఆంజనేయులు కోరారు.
నరసరావుపేటలో తెదేపా నాయకుల ర్యాలీ - నరసరావుపేటలో తెదేపా నాయకుల ర్యాలీ వార్తలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెదేపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నరసరావుపేటలో తెదేపా నాయకుల ర్యాలీ