ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి అప్పలరాజును బర్తరఫ్ చేయాలి' - పోరాట యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

మంత్రి అప్పలరాజును బర్తరఫ్ చేయాలని గుంటూరు జిల్లాలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. పోరాట యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలని వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టిన మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

tdp  leaders protest
తెదేపా నేతలు నిరసన

By

Published : Dec 27, 2020, 3:36 PM IST

సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలన్న మంత్రి అప్పలరాజును, తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ అన్నారు. మంత్రి తీరును నిరసిస్తూ గుంటూరులో నిరసన చేపట్టారు. కులాల మధ్య చిచ్చుపెట్టిన అప్పలరాజుని బర్తరఫ్ చేయాలన్నారు. పోరాట యోధుడు గౌతు లచ్చన్నపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details