రాష్ట్రంలో అట్టడుగు వర్గాల వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా ఎస్సీ నాయకులు నిరసన చేపట్టారు. మంత్రి పెద్దిరెడ్డి అణగారిన వర్గాలను దూషించారని.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అర్బన్ పోలీస్ స్టేషన్లో మంత్రిపై ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఎస్సీలపై అత్యాచారాలు, భౌతిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. అంబేడ్కర్ రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఎస్సీలపై దాడులు నిరసిస్తూ తెదేపా నేతల నిరసన - చిలకలూరిపేటలో తెదేపా నేతల నిరసన
రాష్ట్రంలో అట్టడుగు వర్గాల వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా ఎస్సీ నాయకులు నిరసన చేపట్టారు. బలహీన వర్గాలను దూషిస్తూ మాట్లాడారని మంత్రి పెద్దిరెడ్డిపై అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
![ఎస్సీలపై దాడులు నిరసిస్తూ తెదేపా నేతల నిరసన tdp leaders protest in chilakaluripet guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8144207-283-8144207-1595509819632.jpg)
తెదేపా నేతల నిరసన