గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. తమ పార్టీ నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. నరసరావుపేట తెదేపా ఇంచార్జి చదలవాడ అరవిందబాబు, తెదేపా నాయకులు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు.
TDP protest: నరసరావుపేట పీఎస్ ఎదుట తెదేపా నేతల ఆందోళన
నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. పాలపాడులో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువులు తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ.. నరసరావుపేట ఠాణా ఎదుట తెదేపా నేతలు నిరసన చేపట్టారు.
పాలపాడు గ్రామంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఇరు పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన వివాదంలో ఆరుగురు టీడీపీ నాయకులను శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్టును వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులు ఠాణా ఎదుట ఆందోళన చేశారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన తెదేపా నాయకులను విడిచి పెట్టేవరకూ నిరసన విరమించేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
ఇదీచదవండి.