ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణ కరకట్ట విస్తరణ పనుల ప్రాంతంలో తెదేపా నేతల ఆందోళన - కృష్ణా కరకట్ట విస్తరణ పనుల ప్రాంతంలో తెదేపా నేతల నిరసన వార్తలు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెదేపా నేతలు.. కృష్ణా కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ తన అనుచరుల జేబులు నింపేందుకే కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారని ఆరోపణలు చేశారు.

tdp leaders protest at krishna dam extension works
కృష్ణా కరకట్ట విస్తరణ పనుల ప్రాంతంలో తెదేపా నేతల ఆందోళన

By

Published : Jul 2, 2021, 9:28 PM IST

ముఖ్యమంత్రి జగన్ తన అనుచరుల జేబులు నింపేందుకే కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారని.. తెదేపా నేతలు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెదేపా నేతలు.. కృష్ణా కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో రహదారులు 90శాతం పనులు పూర్తయ్యాయని.. వాటిని పూర్తి చేయకుండా ఎవరికీ ఉపయోగం లేని కరకట్ట విస్తరణ చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఇసుకను దోచుకునేందుకే.. కరకట్ట విస్తరణ ప్రారంభించారని ఆరోపించారు. ప్రజల అవసరాలు కాకుండా తన స్వప్రయోజనాల కోసమే జగన్ పనిచేస్తున్నారని.. ఇది మరోసారి రుజువైందని వారు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details