ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతల నిరసనలు - గుంటూరు జిల్లాలో తెదేపా ధర్న వార్తలు

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందచేయాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేతల ధర్నా చేశారు. అర్హులైన పేదలందరికే ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు.

tdp leaders protest at guntur
గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెదేపా నిరసనలు

By

Published : Jul 6, 2020, 8:10 PM IST

గుంటూరు తెదేపా కార్యాలయంలో నేతలు నిరసన చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాలు పేరుతో భారీ అవినీతికి పాలపడ్డారని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు తక్షణమే అందచేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 12లక్షల మందికి ఇళ్లను కేటాయించి మంజూరుకు సిద్ధం చేస్తే.. ఇంతవరకు లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకపోవడం దారుణమనన్నారు.

వినుకొండలో..

వినుకొండకు నాలుగు వేల ఇళ్లు మంజూరు చేయించి.. నిర్మాణాలు పూర్తి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించలేదని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. తెదేపా నేతలతో ఆయన ధర్నా చేపట్టారు.

నరసరావుపేటలో..

ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు లబ్ధి పొందారని నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు అన్నారు. అర్హులైన పేదలందరికే ఇళ్లస్థలాలు కేటాయించాలంటూ తెదేపా శ్రేణులు.. పార్టీ కార్యాలయంలో డిమాండ్ చేశారు. నరసరావుపేటలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో టిడ్కో సంస్థ ద్వారా 1504 గృహాలు నిర్మించిన విషయం గుర్తు చేశారు. ఇప్పటి వైకాపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ అందులోని 1100 మందికి ఇళ్లు కేటాయించి మిగిలిన 360 మంది అర్హులకు ఇల్లు ఇవ్వకుండా నిలిపివేశారని ఆరోపించారు. ఈ విషయంపై తెదేపా హైకోర్టులో స్టే తీసుకు వచ్చిందని చెప్పారు. త్వరలో మిగిలిపోయిన అర్హులందరికీ వారి ఇల్లు వారికి వచ్చేలా పార్టీ బాధ్యత తీసుకుంటుందని అరవింద బాబు తెలిపారు.

ఇదీ చూడండి:

'ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 6 లక్షల ఇళ్లను పక్కన పెడతారా?'

ABOUT THE AUTHOR

...view details