ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నేతల నిరసన. - నరసరావుపేటలో తెదేపా నేతల నిరసన

నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ తెదేపా నాయకులు నిరసనకు దిగారు. తెదేపా కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వారిని విడిచిపెట్టాలని ధర్నా చేశారు.

tdp leaders protest at front of narasaraopet rural police station in guntur
అర్థరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న తెదేపా నేతలు

By

Published : Dec 27, 2019, 9:58 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నేతల నిరసన చేశారు. రెండురోజుల క్రితం యలమంద గ్రామంలో జరిగిన చిన్న గొడవకు ముగ్గురు కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ధర్నా చేశారు. వారిని విడిచిపెట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.పోలీసుల ఉద్యమాన్ని అణిచివేయడానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా నేత చదలవాడ అరవిందబాబు ఆరోపించారు.
పోలీసులు మాత్రం కేసు బనాయించిన ముద్దాయిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని తెలపడంతో....తెల్లవార్లు దాకా వారు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి స్టేషన్ కు చేరుకుని అరవింద బాబుతో చర్చించి స్టేషన్ బెయిల్ పై తెదేపా కార్యకర్తలను విడిచి పెట్టడంతో సమస్య సద్దుమణిగింది.

నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నేతల నిరసన.

ABOUT THE AUTHOR

...view details