గుంటూరు తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో పెద్దపీట వేయటంలో, సంక్షేమ పథకాల అమలులో ఆద్యుడు ఎన్టీఆర్ అన్నారు. అమరావతి గురించి మంత్రులే అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పిడుగురాళ్లలో నివాళులు అర్పించారు. తెలుగు జాతికే ఎన్టీఆర్ గర్వ కారణమని.. ఆయన చేసిన సేవలు వెలకట్టలేవని అన్నారు. అనంతరం అన్నదానం చేశారు.