TDP Leaders on YSRCP Governance:జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ నేతలు జోస్యం చెప్పారు. అందుకోసమే ఎమ్మెల్యేల మార్పు అంటూ జగన్ ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించారు. 2024లో ఒక రాక్షస పాలన అంతమై, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వెల్లడించారు. జనం మెచ్చిన పాలన చేశానని పదేపదే చెప్పే జగన్, సిట్టింగ్‌లకు అదే స్థానంలో టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు.
విధ్వంస నామ సంవత్సరం: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తోనే జగన్ పతనం ప్రారంభం కాదు, అంతం అయిందని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందన్నారు. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు. 2023 జగన్ విధ్వంస నామ సంవత్సరంగా ముగిసిందన్నారు. 2024లో ఒక రాక్షస పాలన పోయి సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. జగన్ బీసీలకు ఒక టికెట్ ఇస్తే, చంద్రబాబు నాలుగు టిక్కెట్లు ఇస్తాడని గుర్తు చేశారు. తెలుగుదేశం అంటే బీసి, బీసి అంటే తెలుగుదేశం అనేది బ్రాండ్ అన్నారు. అభ్యర్థులను మార్చాలని జగన్ చూస్తున్నారని, జగన్‌ను మార్చాలని ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల ద్రోహి సీఎం జగన్ అని దుయ్యబట్టారు. విజయవాడ వెస్ట్‌లో తెలుగుదేశం గెలవబోతుందన్నారు. ఈ సారి విజయవాడ వెస్ట్ నుంచి సైకిల్ అసెంబ్లీకి వెళ్లడం ఖాయమన్నారు.
2023 జగన్ విధ్వంస నామ సంవత్సరం - 2024లో రాక్షస పాలన పోతుంది: టీడీపీ నేతలు ఎటువంటి హామీలు ఇచ్చేందుకు ప్రస్తుతం సీఎం జగన్ సిద్ధంగా లేరు: మంత్రి ధర్మాన
ఎమ్మెల్యేలను మారిస్తే ప్రజలు నమ్మరు: జనం మెచ్చిన పాలన చేశానని పదేపదే చెప్పే జగన్, సిట్టింగ్‌లకు అదే స్థానంలో టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు. అధికారులను మార్చినట్లు ఎమ్మెల్యేలను మారిస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశామని సీఎం జగన్‌తో సహా వైఎస్సార్సీపీ నేతలు చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. 750 హామీలను ఇచ్చి 29 హామీలను మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. జగన్ నమ్ముకున్న ఆర్కేను రోడ్డు మీద వదిలి పెట్టాడని ఎద్దేవా చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా నలుగురు రెడ్డిలు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఓడిపోతానని తెలిసి కులాల్ని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కసారి జగన్‌ను కలిసే అవకాశం కల్పించండి: డొక్కా మాణిక్య వరప్రసాద్
పారిశుద్ధ్య కార్మికులతో సీఎం జగన్ చెలగాటం: కుళ్లిపోయిన జగన్ ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చి పారేస్తారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఈ ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వలేదన్నారు. రిటైరైన వారి స్థానాలను భర్తీ చేయకుండా పనిభారం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్కాస్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు నామమాత్ర జీతాలే ఇస్తున్నారని ఆక్షేపించారు. కొన్నిచోట్ల కార్మికులని బెదిరించి, మోసపూరిత హామీలతో పని చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు మార్చాలనుకునేది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్నే: గంటా శ్రీనివాసరావు