ఏ2 అల్లుడు కంపెనీకి 108, 104 అంబులెన్స్‌లను దానం చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద తెదేపా ముఖ్యనేతలు బ్యానర్ పట్టుకుని నినాదాలు చేశారు. ఈ వాహనాలకు సంబంధించి రూ.300 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
ఏ2 అల్లుడు కంపెనీకి 108, 104 అంబులెన్స్‌లు దానం చేశారు: తెదేపా - 108,104 వాహనాలపై తెదేపా నేతల నిరసన
108, 104 వాహనాలకు సంబంధించి రూ.300 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని తెదేపా నేతలు ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద ధర్నా చేశారు. ఏ2 అల్లుడు కంపెనీకి 108, 104 అంబులెన్స్‌లను దానం చేశారని విమర్శించారు.
![ఏ2 అల్లుడు కంపెనీకి 108, 104 అంబులెన్స్‌లు దానం చేశారు: తెదేపా tdp leaders on 108,104 vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7848200-818-7848200-1593608064525.jpg)
108,104 వాహనాలపై తెదేపా నేతల నిరసన
మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు పార్టీ నేతలు వర్ల రామయ్య, జీవి ఆంజనేయులు, కొమ్మారెడ్డి పట్టాభి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి