ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో త్వరగా విచారణ జరపండి' - ఏపీ తాజా వార్తలు

గుంటూరు అర్బన్​ అదనపు ఎస్పీని తెదేపా నేతలు కలిశారు. చంద్రబాబు ఇంటి దాడి ఘటనపై వినతిపత్రం అందజేశారు. ఘటనపై తాడేపల్లి పోలీసుస్టేషన్​లో ఇచ్చిన ఫిర్యాదుపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

tdp leaders meet guntur urban sp
tdp leaders meet guntur urban sp

By

Published : Sep 24, 2021, 5:06 PM IST

మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి (attack on Chandrababuhouse) ఘటనలో... త్వరగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని తెదేపా నేతలు కోరారు. లేని పక్షంలో ప్రైవేట్ కేసులు వేసి న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఈ మేరకు తాడేపల్లి స్టేషన్​లో ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ తెదేపా నేతలు గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీని(tdp leaders meet guntur urban additional sp) కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈనెల 17న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పైన దాడి(attack on Chandrababuhouse news)జరిగిందని... ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(buddha venkanna) అన్నారు. అక్కడ జరిగిన దాడిని తాము అడ్డుకున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. ఫిర్యాదుపై డీఐజీ కనీసం స్పందించటం లేదన్నారు. పోలీస్ అధికారులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారన్నారని విమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని పట్టాభిరాం తేల్చిచెప్పారు. తాడేపల్లి ఘటనలో చట్టపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే.. న్యాయస్థానాలు ముందు డీజీపీ, వైకాపా నాయకులు దోషులుగా నిలవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details