జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది బిహార్‌లా తయారైందని మాజీమంత్రి, తెదేపా నేత కేఎస్ జవహర్ విమర్శించారు. ఎస్సీలపై వరుస దాడులే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆంధ్రా వర్సిటీలో అధ్యాపకుడు ప్రేమానందం విషయంలో ఉప కులపతి, రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోకపోగా.. వైకాపా ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రేమానందం విషయంలో తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేసి.. ఆయనను కించపరిచేలా వ్యవహరించిన రిజిస్ట్రార్‌ను అరెస్ట్ చేసి వీసీని సస్పెండ్ చేయాలని జవహర్ డిమాండ్ చేశారు.
ఇదేనా పారదర్శకత..?