వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ విధానాలకు నిరసనగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు వీటిని ప్రారభించారు.
'రైతులను ఆదుకోకుంటే పోరాటమే' - వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అన్యాయం చేస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. మిర్చి, పసుపు రైతులకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్షకుల సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
tdp leaders hunger strikes
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మన్నవ సుబ్బారావు విమర్శించారు. మిర్చి, పసుపు రైతులకు రావాల్సిన నగదును తక్షణమే మార్క్ఫెడ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా వేళ రైతులను ఆదుకోవటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి
'వైకాపా నేతలు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు'