ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడ్డుకుంటున్న పోలీసులు.. నిరసిస్తున్న నేతలు - తెదేపా నేతల గృహనిర్బంధం వార్తలు

గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్లనీయకుండా తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. నాయకుల ఇంటి ముందు మోహరించి వారు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల చర్యలను నేతలు ఖండించారు.

tdp leaders house arrest
జైల్​ భరో కార్యక్రమం.. తెదేపా నేతల గృహనిర్బంధం

By

Published : Oct 31, 2020, 10:50 AM IST

గుంటూరు జిల్లాలో..

అమరావతి రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జైల్​భరో కార్యక్రమానికి వెళ్లనీయకుండా.. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. పోలీసులు ప్రత్తిపాటి ఇంటి వద్ద మోహరించారు.

కృష్ణా జిల్లాలో..

ఎస్సీ, ఎస్టీ రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ గుంటూరు జైల్​భరో కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్​ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను నేతలు ఖండించారు.

ఇవీ చదవండి:

జైల్ భరోకు అమరావతి ఐకాస పిలుపు.. నేతల గృహ నిర్బంధాలు

ABOUT THE AUTHOR

...view details