ప్రజలకు నవరత్నాలు పంచుతామని వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారు. చివరికి ఇసుక, మట్టిని కూడా అమ్ముకుంటున్నారు. రీచ్‌లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని వైకాపా ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే ఇసుక దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇసుక దోపిడికి అడ్డుకట్ట వేయాలి... లేదంటే ఇసుక తుపానులో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం-కళా వెంకట్రావు,తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో దొంగలు పడి దోచేస్తున్నారు. సామాన్యులకు దొరకని ఇసుక అంతా... ఎక్కడికి వెళ్తోంది. ఆన్లైన్ అని చెప్పి మళ్లీ వెంటనే మూసివేయడం ఏంటి -గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా సీనియర్ నేత
నాలుగు వారాల్లో రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇకనైనా రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవటం మానుకోవాలి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి
వేలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి వైకాపా రంగులు వేశారు. ఖర్చు పెట్టిన వేల కోట్లు ఖజానాకు చెల్లించాలని ప్రజలు అడుగుతున్నదానికి జగన్ సమాధానం చెప్పాలి. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి దోచేస్తున్న లక్షలాది టన్నుల ఇసుక దోపిడీపై జగన్ నోరు విప్పాలి - దేవినేని ఉమా, మాజీ మంత్రి