ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగటం లేదు'

పురపాలక ఎన్నికల్లో భాగంగా.. వైకాపా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా నేతలు విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో వైకాపాకు వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని.. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగడం లేదని.. నామినేషన్ వేసిన అభ్యర్థులను దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని.. తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. పురపాలక ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు.

tdp leaders fires on ycp alleging that Elections are not held democratically
'ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగటం లేదు'

By

Published : Mar 5, 2021, 10:03 PM IST

నవరత్నాలకు ఓట్లు పడతాయని నమ్మకం లేకే.. వైకాపా ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని.. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా గెలవలేమని భావించి.. తెదేపా అభ్యర్థులను బలవంతంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో వైకాపాకు వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మెజార్టీ మునిసిపాలిటీలు తెదేపా కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనతోనే ముందుకు వెళ్తున్నాయని ఆరోపించారు. ఎంతోమంది ప్రాణాలర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

భయానక వాతావరణంలో ఎన్నికలు: నక్కా ఆనంద్ బాబు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు భయానక వాతావరణంలో జరుగుతున్నాయని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పల్లెల్లో అశాంతి నెలకొల్పారని.. ఇప్పుడు పట్టణాల్లోనూ అలాగే చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగడం లేదని.. నామినేషన్ వేసిన అభ్యర్థులను దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

వైకాపా నేతల అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని.. కమిషనర్ తన పంతం కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తెనాలి మున్సిపాలిటిలో తెదేపాను గెలిపిస్తే.. పూర్వ వైభవం తెస్తామని అన్నారు.

ఇదీ చదవండి:

'నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు'

ABOUT THE AUTHOR

...view details