అడ్డదారిలో అధికారంలోకి రావడానికే వైకాపా నేతలు అనేక కుట్ర రాజకీయాలకు తెరలేపారని గుంటూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా... తెదేపా మరోసారి అధికారంలోకి రాబోతుందని జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. వైకాపా నేతలు దాడులతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.
'అధికారంలోకి వచ్చేందుకు వైకాపా కుట్ర రాజకీయాలు' - elections
అడ్డదారిలో అధికారంలోకి రావడానికే వైకాపా నేతలు అనేక కుట్ర రాజకీయాలకు తెరలేపారని గుంటూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు.
పని చేయని ఈవీఎంలతో కుట్రలు
ఏపీలో పని చేయని ఈవీఎంలు ఏర్పాటు చేసి, కుట్ర రాజకీయాలకు తెరలేపారని గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. మోదీ, జగన్, కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా... ఏపీ ప్రజలు తెదేపాకు అండగా నిలిచారన్నారు. గురజాల నియోజకవర్గంలోని 7 ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా అల్లర్లు జరిగాయని తెలిపారు.
తెదేపా నేత కోడెల శివప్రసాద రావుపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ఈసీపై చట్టపరంగా చర్యలు తీసుకునే వరకూ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.