TDP Leaders Fire on CM Jagan: కక్షసాధింపు రాజకీయాలల్లో భాగంగా ఇప్పటికే... పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారనే ఆరోపణల మీద చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు... సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఎఫ్‌ఐఆర్ కాపీ సమర్పించారు. ఇదే అంశంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలుగుదేశం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.
Case on Chandrababu Naidu: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ
Nara Lokesh Fire on CM Jagan: కక్ష సాధింపుకి మానవ రూపం జగన్ అని నారా లోకేశ్ మండిపడ్డారు. పిచ్చికి లండన్ మందులు వాడుతున్నట్టే.. కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదని ఎద్దేవా చేశారు. జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారని లోకేశ్ పేర్కొన్నారు. మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ చంద్రబాబుపై కేసు పెట్టడం వింతగా ఉందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చన్నారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతుందో తేల్చుకునేందుకు రాష్ట్రంలో జగన్ పెట్టిన ఏ లిక్కర్ షాపు ముందైనా తాను చర్చకు సిద్ధమని.. జే బ్రాండ్ సవాల్ విసురుతున్నట్లు లోకేశ్ తెలిపారు. జగన్ ను మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే సమయం చెప్పాలన్నారు. కక్ష సాధింపులో జగన్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్అని లోకేశ్ ఎద్దేవా చేశారు.