గుంటూరులో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన పేదలకు తెదేపా నేతలు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 13, 31, 32, 37, 39, 53 వ డివిజన్ లోని పేదలకు అందించారు.
తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర చెప్పారు.