TDP demands assistance to Mandous Cyclone victims: మాండౌస్ తపాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ధ్వజమెత్తారు. రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పాడైపోయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రైతుల సంక్షేమాన్ని కేవలం పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశాడని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అందించి రైతులను ఆదుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా చేపట్టాలని అచ్చెన్నాయుడు సూచించారు.
తుపాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు - ఏపీ టీడీపీ నేతల కామెంట్స్
Mandous Cyclone victims in AP: మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తుఫాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని,.. రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పాడైపోయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రైతుల సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని అచ్చెన్న దుయ్యబట్టారు.

Mandous Cyclone
నేటికీ అన్నమయ్య డ్యాం బాధితులకు ప్రభుత్వం నయాపైసా సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో నడిరోడ్డున పడిన కుటుంబాలకు ఆశ్రయం కల్పించలేదని వాపోయారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడాన్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోందని తేల్చిచెప్పారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: