రాష్ట్రంలో నాటుసారా అమ్మకం, తయారీ నిర్మూలించాలని కోరుతూ గుంటూరులో తెదేపా శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాత గుంటూరు ఎన్టీఆర్ కూడలిలోని ప్రభుత్వ వైన్స్ ముందు మద్యం సీసాలు చేతపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మద్యం సీసాలను పగలకొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
"నాటు సారాను అరికట్టండి.. తయారీదారులపై చర్యలు తీసుకోండి" - Natusara issue
రాష్ట్రంలో నాటుసారాను నిర్మూలించాలని కోరుతూ గుంటూరులో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. పాదయాత్రలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే నకిలీ మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైన్స్ ముందు మద్యం సీసాలు చేతపట్టి ఆందోళన వ్యక్తం చేశారు.
TDP leaders Concern of Natusara
పాదయాత్రలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే నకిలీ మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. నాటుసారా కారణంగా అనేక మంది మృత్యవాత పడితే అసెంబ్లీ సాక్షిగా వాటిని సహజ మరణాలనడం.. సిక్కుచేటని దుయ్యబట్టారు. తక్షణమే కల్తీసారా కారణంగా మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:నూజివీడులో ఉద్రిక్తత.. వైకాపా, తెదేపా నేతల సవాళ్లు..!