TDP leaders on YSRCP BC meeting: వైకాపా నిర్వహిస్తున్న సభ బీసీల ఆత్మీయ సభ కాదని.. బీసీల ఆత్మ వంచన సభ అంటూ తెదేపా నేతలు కొల్లు రవీంద్ర, బెందాళం అశోక్ ధ్వజమెత్తారు. మూడున్నర సంవత్సరాల్లో గుర్తుకు రాని బీసీలపై.. వైకాపా ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీలు రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని చెప్పి,.. ఆ బ్యాక్ బోనునే విరిచేశారని దుయ్యబట్టారు.
వైకాపాది బీసీల ఆత్మీయ సభ కాదు.. ఆత్మ వంచన సభ: తెదేపా - Not a spiritual assembly of BCs
TDP leaders on YSRCP BC meeting: బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తామని గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఈ మూడున్నర సంవత్సరాల్లో వారికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బెందాళం అశోక్ డిమాండ్ చేశారు.
కొల్లు రవీంద్ర
వైకాపా ప్రభుత్వం బీసీలకు చేసిన మేలు ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం 217 వల్ల మత్స్యకారుల కడుపు కొడుతున్నారన్నారు. చేనేత కార్మికుల పథకాలను రద్దు చేయడం అన్యాయం అన్నారు. నాయీ బ్రాహ్మణులకు పెడుతున్న ఆంక్షల వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: