TDP Leaders Comments on Sajjala Ramakrishna Reddy:ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వీరు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారంలో న్యాయమూర్తులపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. న్యాయమూర్తిని తప్పుబట్టి మాట్లాడిన పొన్నవోలును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని అన్నారు. తాను న్యాయస్థానాలపై ఏం వ్యాఖ్యలు చేయకపోయినా తనకు నోటీసులు జారీ చేశారని బుచ్చయ గుర్తుచేశారు. ఇప్పుడు అధికార పక్ష నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ రాజ్యం ఇకపై చెల్లదని.. అధికారుల ధోరణి మారడం లేదని... తన వెంట్రుక కూడా పీకలేరని బుచ్చయ్య వ్యాఖ్యానించారు. జైల్లో పెట్టినా... అధికారంలోకి రాగల శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని అన్నారు.
ఒకే ఇంట్లో ఒక్కరికే పింఛన్ నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహారశైలి న్యాయవాద వృత్తికే కళంకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఏ అడ్వకేట్ జనరల్ కూడా ఇంత బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి న్యాయస్థానాన్ని నిందించలేదని మండిపడ్డారు. తనకీ పదవిచ్చిన జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని పొన్నవోలు తన పరిధి దాటి మాట్లాడుతున్నారని వర్ల ఆక్షేపించారు. తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఏకవచనంతో సంబోధించడం పొన్నవోలు అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కరడు కట్టిన వైసీపీ నేతలా ప్రవర్తిస్తున్నాడని విమర్శలు గుప్పించారు.జగన్ కళ్లలో ఆనందం కోసంఎమైనా చేస్తాడని విమర్శించారు. అలా అయితే రాజీనామా చేసి వైసీపీ తరుఫున పోటి చేయాలని ఎద్దేవా చేశారు. ప్రజల జీతంతో వైసీపీకి సేవ చేస్తున్నాడని విమర్శించారు. పొన్నవోలు టార్గెట్ చంద్రబాబు కేసు కాదని, చంద్రబాబును వేధించి జగన్ ను సంతోషపరచడమే అని ఆరోపించారు.