ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వంపై తెదేపా నేతల మండిపాటు - ప్రభుత్వంపై మండిపడిన కేశినేని నాని

ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములు వేలానికి పెట్టిందంటూ మాజీమంత్రి దేవినేని దుయ్యబట్టగా... కరెంట్ ఛార్జీలపై బొండా ఉమా మండిపడ్డారు. వలస కూలీల నడకపై సీఎస్ ఇప్పుడా స్పందించటం అంటూ కేశినేని నాని తనదైన శైలిలో స్పందించారు.

tdp leaders comments on govt in twitter
ప్రభుత్వంపై మండిపడిన తెదేపా నేతలు

By

Published : May 16, 2020, 4:29 PM IST

కరోనా కష్ట సమయంలో విశాఖ, గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం వేలానికి పెట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసమే జీవో 98ను విడుదల చేశారని ట్వీట్ చేశారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని ధ్వజమెత్తారు.

గత నెల రోజులుగా వలస కార్మికులు రోడ్లు మీద నడుస్తూ ఆకలితో అలమటిస్తున్న విషయం అన్ని టీవీల్లో, పేపర్లలో చూస్తుంటే... సీఎస్ వ్యవహార శైలి ఇప్పుడే నిద్ర లేచినట్లుందని కేశినేని నాని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

కరెంట్ ఛార్జీలు పెంచలేదు అనటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా ట్విట్టర్​లో ధ్వజమెత్తారు. ఫిబ్రవరిలో 300 రూపాయల బిల్లు వస్తే... మార్చి, ఏప్రిల్ నెలల బిల్లు 3 వేల రూపాయలు ఎలా వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'చిన్న బడ్జెట్ స్కూళ్లకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోండి'

ABOUT THE AUTHOR

...view details