తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై జరిగిన దాడి యత్నాన్ని... కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెదేపా శాసనసభా పక్షం ప్రకటించింది. పార్లమెంట్‌లోనూ ఈ దుశ్చర్యను లెవనెత్తే అవకాశాలు పరిశీలిస్తున్నామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి, డీజీపీ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ప్రకటనతో ప్రజలంతా విస్మయం చెందారన్నారు. డీజీపీ వ్యవహారంపై న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు.
పోలీసులే దగ్గరుండి వైకాపా రౌడీలతో దాడి చేయించారని ఆరోపించారు. జెడ్‌ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి పర్యటిస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు చంద్రబాబు పర్యటనకు బ్రహ్మరథం పట్టారన్నారు. వైకాపా తప్పుడు పనుల్లో డీజీపీ సవాంగ్ భాగస్వామి అయ్యారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడిని సమర్థిస్తూ... డీజీపీ, మంత్రులు ప్రకటనలు చేయడం హేయమని ధ్వజమెత్తారు.