ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపా నేతల ప్రదర్శన - latest news of tdp leaders arrest

తెదేపా నేతల అరెస్టుకు నిరసనగా... గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

tdp leaders bike rally in guntur dst thenlai against arrest of tdp members
tdp leaders bike rally in guntur dst thenlai against arrest of tdp members

By

Published : Jun 15, 2020, 12:38 AM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తెనాలి మార్కెట్ కూడలి నుంచి గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అయితే నిబంధనలు అతిక్రమించారని బైక్ ర్యాలీ, మానవహారంలో పాల్గొన్న తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు.

ABOUT THE AUTHOR

...view details