ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణారావు అంత్యక్రియల్లో పాల్గొన్న తెదేపా నేతలు - Sattenapalli news

గుంటూరు జిల్లా లక్కరాజు గార్లపాడులో కృప్ణారావు కుటుంబ సభ్యులను తెదేపా నేతలు పరామర్శించారు. కృష్ణారావు అంత్యక్రియల్లో పార్టీ నేతలు వర్ల రామయ్య, జి.వి.ఆంజనేయులు, యరపతినేని, కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే ప్రత్యర్థుల దాడిలో కృష్ణారావు గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే.

TDP leaders attending Krishna Rao funeral
కృష్ణారావు అంత్యక్రియల్లో పాల్గొన్న తెదేపా నేతలు

By

Published : Mar 20, 2021, 3:50 PM IST

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తెదేపా నేత కృష్ణారావు కుటుంబాన్ని శనివారం పలువురు తెదేపా నేతలు ఆయన గృహానికి వెళ్లి పరామర్శించారు. మొదటగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చేరుకున్నారు.

అక్కడ.. కృష్ణారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తరువాత కృష్ణారావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు వర్ల రామయ్య, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details