TDP Leaders and Activists Protest Across the State:స్కిల్ డెవలప్మెంట్(Skill Development Case) కేసులో అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడంపై నిరసనలు మిన్నంటుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహార దీక్షలను ఉద్ధృతం చేశారు.
Rajamahendravaram..వినాయకచవితి సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. రాజమహేంద్రవరం నాలాం భీమరాజు వీధిలోని శ్రీసిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట బ్రాహ్మణి, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరి విద్యానగర్‌లోని దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన కొనసాగించారు.
Krishna District..కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు శివాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. నందిగామ రైతులు చేపట్టిన వినాయక చవితి పూజలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.
NTR District..చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వాలన్న ఆకాంక్షతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజు కొనసాగాయి. మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షాశిబిరం వద్ద ఏర్పాటుచేసిన గణనాథుని విగ్రహానికి పూజలు చేశారు.
Guntur District..ప్రభుత్వ కుట్రల్ని ఛేదించుకొని చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని కాంక్షిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజధాని రైతులు, తెలుగుదేశం నేతలు దీక్షలు కొనసాగించారు. దీక్షా శిబిరంలోనే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. తుళ్లూరు మండలం మందడంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాడికొండలో తెలుగుదేశం నాయకులు వినాయకచవితి పండుగను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించారు . చంద్రబాబు విడుదల ఆలస్యమయ్యే కొద్దీ నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Bapatla District..బాపట్ల జిల్లా అద్దంకిలో రిలే నిరాహార దీక్షల్లో ముస్లింలు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొని నిరసనలు కొనసాగించారు. బాబుతో మేముసైతం అంటూ నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులూ దీక్షలకు సంఘీభావం తెలిపారు. చీరాలలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద ఆరో రోజూ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
Chandrababu Followers Rally in LB Nagar : 'చంద్రబాబును విడుదల చేసేంత వరకు నిరసనలు కొనసాగుతాయి'
Kurnool District..చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు కర్నూలు ధర్నాచౌక్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ముస్లిం మైనార్టీలు దీక్షలకు మద్దతు తెలిపారు. యువత, వృద్ధులు 101 టెంకాయలు కొట్టి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
Anantapur District..స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని సీమెన్స్ సంస్థ అధికారులే చెబుతున్నా సీఎం జగన్‌కు అర్థం కావడం లేదని అనంతపురం తెలుగుదేశం నాయకులు ఆక్షేపించారు. చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముస్లిం మైనార్టీలు ఆందోళన చేపట్టారు.