TDP Leaders Allegations on CM Jagan:వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పచ్చి అబద్ధాలు, భారీ మోసాలతో జగన్మోసపు రెడ్డి విద్యాదీవెన పథకం అమలు అయిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. (Pattabhi Allegations on CM Jagan) మొత్తంగా జగన్మోసపు రెడ్డి విద్యార్థి లోకానికి 3,400 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడని ఆరోపించారు. విద్యార్థులకు మేనమామనని చెప్పే జగన్ రెడ్డి వారి పాలిట కంసమామ అనడానికి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మోసగించిన జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ఓటు అనే బటన్ నొక్కి బంగాళాఖాతంలో కలపాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
అబద్దపు హామీల పునాదులపై కట్టిన వైసీపీ గోడలు కూలిపోతున్నాయి: టీడీపీ నేతలు
Devineni Uma Allegations on CM Jagan:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవ మోసాలయ్యాయని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి జగన్పై ఆరోపణలు చేశారు. 730 హామీల్లో అమలయ్యింది 21 హామీలు అయితే పాక్షికంగా అమలయ్యింది 88 హామీలని అన్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 15 పర్సెంట్తో ఫెయిలయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయానికి వస్తే ధాన్యం, ప్రత్తి మార్కెట్ యార్డ్లలో దళారుల దోపిడీకి గురవుతుందని అన్నారు. నీళ్లు సమయానికి ఇవ్వకపోవడం వలన లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు నష్టపోయారని నిలదీశారు.