ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Leaders Allegations on CM Jagan: అరాచకాలు పెరిగిపోయాయి.. అవినీతిపై వైసీపీ చర్చకు సిద్ధమా.. టీడీపీ సవాల్ - AP Latest News

TDP Leaders Allegations on CM Jagan: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెరిగిపోయాయని టీడీపీ నేతలు సీఎం జగన్​పై ధ్వజమెత్తారు. మీడియా సమావేశం నిర్వహించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సెంటు భూమి పట్టాల పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని నిరూపించేందుకు తాము సిద్ధమని.. వైసీపీలో ఎవరైనా తమ సవాల్ స్వీకరించగలరా అని సవాల్ చేశారు.

tdp_allegations_on_jagan
tdp_allegations_on_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 7:19 PM IST

TDP Leaders Allegations on CM Jagan: అరాచకాలు పెరిగిపోయాయి.. అవినీతిపై వైసీపీ చర్చకు సిద్ధమా.. టీడీపీ సవాల్

Vijay Kumar Allegations on CM Jagan:డిజిటల్ కార్పోరేషన్​లో మెజార్టీ ఉద్యోగులు వైసీపీ సోషల్ మీడియా వారే అని చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్ట పెంచేందుకు మాత్రమే డిజిటల్ కార్పోరేషన్ పని చేస్తోందని చెప్పిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రతి ఏటా బడ్జెట్​లో డిజిటల్ కార్పోరేషన్​కు 100కోట్ల కేటాయింపులు చేయలేదా అని ప్రశ్నించారు. త్రైమాసికనికి బడ్జెట్ రిలీజ్ ఆర్దర్లు వస్తోంది వాస్తవం కాదా అని ధ్వజమెత్తారు. డిజిటల్ కార్పోరేషన్ అకౌంట్ల మదింపు 2019- 20 తర్వాత చేయలేదని కాగే (CAG) స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మార్చి 2023 కాగ్ నివేదికలో డిజిటల్ కార్పోరేషన్ -1.19 నెగటివ్ నెట్వర్త్​లో ఉన్నట్లు కూడా కాగ్ నిర్ధారించిందన్నారు.

Chandrababu Tweet on YCP: 'నాలుగేళ్ల నరకం' పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమం.. చంద్రబాబు ట్వీట్

Varla Ramaiah Allegations on CM Jagan:చంద్రబాబును అరెస్టు రోజు లండన్ నుంచి రఘురామిరెడ్డి, సంజయ్, సజ్జలతో వీడియో కాన్ఫరెన్స్​లో జగన్ మాట్లాడింది నిజం కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. 11 ఏళ్ల నుండి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు నుండి తప్పించుకు తిరుగుతున్న జగన్ కోర్టు విచారణ చేస్తే శేష జీవితమంతా జైల్లోనే గడపాలని విమర్శించారు.

YSRCP Spreading Fake News Against Chandrababu: చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా వైసీపీ.. ఫేక్​ ఫోన్​ కాల్​పై టీడీపీ నేతల ఆగ్రహం..

Panchumarthi Anuradha Allegations on CM Jagan:పేదల ఇళ్ల పేరుతో 7వేల కోట్లు దోచేసిన వైసీపీ నేతలే అసలు పెత్తందారులని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధధ్వజమెత్తారు. పెత్తందారులతో కలిసి ప్రజల్ని భయపెట్టే దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ప్రయివేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నొక్కేసిన కమిషన్ ఎంతో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను తన ప్రభుత్వ ఖాతాలో వేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా అని నిలదీశారు. బీసీలు, ఎస్సీలను హత్య చేయించి.. నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకోవటానికి నోరెలా వచ్చిందని దుయ్యబట్టారు. అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం తెలిసి కూడా నా మైనార్టీలని ఎలా చెప్పుకోగలడని దుయ్యబట్టారు.

Smart Meters: యూపీకి అదానీ వద్దు ఏపీకి అదానీ ముద్దు: సోమిరెడ్డి

Nakka Anand Babu Allegations on CM Jagan:అసత్యాలను చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సామర్లకోట సభలో ప్రజాధనం వెచ్చించాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్నారని జగన్ పొందేది శునకానందమేనని దుయ్యబట్టారు. కేసీఆర్ దగ్గర ఇరుక్కుపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. కుటుంబ గౌరవాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. సెంటు భూమి పట్టాల పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని నిరూపించేందుకు తాము సిద్ధమని.. వైసీపీలో ఎవరైనా తమ సవాల్ స్వీకరించగలరా అని సవాల్ చేశారు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదల ముఖాలు చూడకూడదని రాత్రికి రాత్రే ఖాళీ చేయించిన సీఎం.. పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ చర్యలతో పేదల కళ్లల్లో రక్తం కారుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతున్నాడని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details