గుంటూరు జిల్లా మేడికొండూరు పంచాయతీ కార్యాలయం ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్రెడ్డి విగ్రహం పెట్టేందుకు గుంత తీశారు. విగ్రహం పెట్టేందుకు ఎలాంటి అనుతులు లేవని తెలుసుకున్న తెలుగుదేశం అక్కడకు చేరుకొని పనులు ఆపేసింది. తెదేపా నాయకులు మాట్లాడుతూ... వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు రాత్రికి రాత్రే గుంత తీయటమేంటని ప్రశ్నించారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టానుసారం చేస్తే... చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు.
అనుమతుల్లేకుండా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నం... తెదేపా అభ్యంతరం.. - medikondur ysr statue issue news
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అనుమతి లేకుండా పెట్టేందుకు యత్నించడంపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాత్రికి రాత్రే ఇలా చేయడమేంటని వారు ప్రశ్నించారు.

విగ్రహం ఏర్పాటుపై తెదేపా అభ్యంతరం