TDP Leaders about Nagarjuna Sagar Issue: నాగార్జున సాగర్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ వివాదమే నిదర్శనమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.
మంత్రి రాంబాబు స్వామి మాలలో ఉండి ఇంగితం లేకుండా అబద్ధాలు చెబుతూ మీసాలు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యుడని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టామో, ఎన్ని పూర్తిచేసి లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామో ధైర్యంగా చెప్పగలమన్నారు.
54 నెలల్లో జగన్ రెడ్డి ఇరిగేషన్ రంగానికి ఏం వెలగబెట్టాడో చెబుతూ, వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగలడా అంటూ దేవినేని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అసమర్థత, చేతగానితనం వల్లే శ్రీశైలం డ్యామ్ నుంచి పక్క రాష్ట్రం నీళ్లు తరలించుకుపోయిందని మండిపడ్డారు. శ్రీశైలం నుంచి నీళ్లు దొంగిలిస్తున్నా రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తని జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి కాడా అని నిలదీశారు.
నాగార్జున సాగర్ డ్యాం వద్ద మళ్లీ టెన్షన్ - భారీగా పోలీసుల మోహరింపు
Nakka Anand Babu On Nagarjuna Sagar Issue: నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెట్టి కేసీఆర్తో అంటకాగిన జగన్ ఇప్పుడు సాగర్ జలాల విషయంలో కొత్త డ్రామాకు తెర లేపారని మాజీమంత్రి నక్కా ఆనంద బాబు విమర్శించారు. గుంటూరులో శ్రీ వికాస్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.