ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారు చులకనవుతున్నారనే.. మాపై విమర్శలు' - సీఎం జగన్​పై యరపతినేని విమర్శల వార్తలు

ప్రజావ్యతిరేక విధానాలతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారని... తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ అన్నారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తి పరిపాలిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో జగన్ ఏడాది పాలనే ఉదాహరణ అని ధ్వజమెత్తారు.

tdp leader yarapathineni srinivas criticises ycp government
యరపతినేని శ్రీనివాస్

By

Published : Jun 4, 2020, 11:47 AM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను న్యాయస్థానాలు తప్పుబడుతుంటే.. చులకనవుతున్న తీరును పక్కదోవ పట్టించేందుకే వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారని మండిపడ్డారు.

అంబటీ.. ఆయనతోపాటు కొండెక్కగలరా!

ప్రతిదానికీ చంద్రబాబు వయస్సుమీద విమర్శలు చేస్తున్నారని.. వారికి వయసు పెరగదని వైకాపా నేతలు భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే అంబటి రాంబాబు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ చేశారు.

అందరూ అవకాశవాదులే

వైకాపా నేతలు విమర్శిస్తున్నట్లుగా లోకేశ్​కి అవినీతిలో అనుభవం లేదని.. వాళ్లలాగా సూట్ కేసు కంపెనీలు పెట్టడం, దొంగ సొమ్ము దోచుకోవటం, అక్రమార్జన చేయటం తెలియదన్నారు. జగన్ చుట్టూ ఉన్నవారంతా అవకాశవాదులని... ధర్మాన, బొత్స, వీళ్లంతా ఒకప్పుడు జగన్​ని విమర్శించినవారు కాదా అని నిలదీశారు.

ఇవీ చదవండి.. మర్మాంగాన్ని కోసి భర్తను చంపిన భార్య

ABOUT THE AUTHOR

...view details