TDP leader Yanamala Comments: ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యమంత్రికి శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం.. గత మూడున్నరేళ్లుగా అధోగతి పాలైందని విమర్శించారు. మైనస్ గ్రోత్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సున్నా పెట్టుబడుల అభివృద్ధి ప్రశ్నార్ధకమైందన్నారు. తెదేపా హయాంలో పారిశ్రామిక, సేవారంగాలు జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వ విధానాలతో అన్ని వ్యవస్థలూ తిరోగమనం పట్టాయన్నారు. ప్రభుత్వ విద్వేష, వికృత, విధ్వంసకర విధానాలతో పరిశ్రమలు రావాలంటే భయపడుతున్నారని యనమల విమర్శించారు. క్షీణించిన శాంతిభద్రతలు, 'నీకది-నాకిది' కమిషన్ల దోపిడీకి భయపడుతున్నారన్నారు.
"మూడున్నరేళ్లుగా పారిశ్రామికరంగం అధోగతి పాలైంది" - సీఎం జగన్‌పై తెదేపా నేత యనమల ఆగ్రహం
TDP leader Yanamala: రాష్ట్రాభివృద్ధికి కీలకమైన పారిశ్రామికరంగం మూడున్నరేళ్లుగా అధోగతి పాలైందని.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎంకు లేఖ రాసిన ఆయన.. మైనస్ గ్రోత్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సున్నా పెట్టుబడుల వల్ల అభివృద్ధి ప్రశ్నార్ధకమైందన్నారు. గత మూడున్నరేళ్లలో 17లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు పరారయ్యాయని మండిపడ్డారు.

గత మూడున్నరేళ్లలో రూ.17లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ ఒప్పందాలు రద్దు, భూములు వెనక్కి తీసుకుంటూ రివర్స్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లుగా గ్రోత్ ఇంజన్లన్నీ రివర్స్‌లో నడుస్తున్నాయన్నారు. ఎఫ్‌డీఐల ఆకర్షణలో 2018-19లో దేశంలో 3వ స్థానం, ప్రస్తుతం 13వ స్థానంలో ఉందని తెలిపారు. రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితి కల్పించారన్న యనమల రామకృష్ణుడు... అలాంటి రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అంటూ ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: