ముఖ్యమంత్రి జగన్ సంతకం లేకుండానే జీవో నెంబర్ 301 విడుదల చేశారా.. అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీవోకు, మెమోకు చాలా తేడా ఉంటుందన్న యనమల... శాఖ కార్యదర్శి, మంత్రి సంతకం లేకుండా... జీవో రాదని పేర్కొన్నారు. జీవో ఆర్టీ నెంబర్ 301 మీద మంత్రి సంతకం తప్పకుండా ఉంటుందని... సదరు మంత్రి ఎవరని ప్రశ్నించారు. అదే జీవోపై ముఖ్యమంత్రి సంతకం కూడా ఉంటుందన్న యనమల....దానిపై సమగ్ర వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నేతల తప్పులకు అధికారులను బలిచేస్తారా?: యనమల - యనమల రామకృష్ణుడు తాజా వార్తలు
సీఎం సంతకం లేకుండానే జీవో నెంబర్ 301 విడుదల అయ్యిందా? అంటూ తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కలాం ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాఖ కార్యదర్శి, మంత్రి సంతకం లేకుండా జీవో రాదన్న యనమల... నేతల తప్పులకు అధికారులను బలిచేయటం సరికాదని వ్యాఖ్యానించారు.
నేతలు చేసిన తప్పులకు... అధికారులను బలిచేస్తారా అంటూ ధ్వజమెత్తారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ లక్ష్యమని... అందులో భాగంగానే ప్రతిభా అవార్డులకు పేరు మార్చారని దుయ్యబట్టారు. సీఎస్ బదిలీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే.... దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును తొలగించారన్నారు. సంక్షేమం పేరుతో... ప్రభుత్వ స్థలాల అమ్మకాన్ని తీవ్రంగా ఖండించారు. వీటికి జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.