ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​పై మంగళగిరి పీఎస్​లో వర్ల రామయ్య ఫిర్యాదు - మంగళగిరి గ్రామీణ పోలీస్​ స్టేషన్​లో సీఎం జగన్‌పై ఫిర్యాదు

సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వారిరువురూ ఎస్సీల మనోభావాలు దెబ్బతీశారంటూ.. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

varla ramaiah complaint on cm, complaint on cm at mangalagiri police station
మంగళగిరి పోలీస్​ స్టేషన్​లో సీఎం జగన్​పై ఫిర్యాదు, సీఎం జగన్​పై వర్ల రామయ్య ఫిర్యాదు

By

Published : Apr 10, 2021, 7:05 PM IST

సీఎంపై ఫిర్యాదు చేస్తున్న వర్ల రామయ్య

సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్​ స్టేషన్​లో తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఫొటోలు పెట్టారని అందులో పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి:రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్

గురుమూర్తిని ముఖ్యమంత్రి తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్న చిత్రాన్ని.. ఆ పార్టీ ఫేస్​బుక్ పేజీలో పెట్టి ఎస్సీల మనోభావాలను కించపరిచారని వర్ల ఆరోపించారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details