వైఎస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడితే తప్పా? - వివేక హత్య కేసు వివరాలు
వైఎస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడితే తప్పా? అని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అసలైన నేరస్థులను పట్టుకోవాలని పోలీసులను అడగడంలో తప్పేముందన్నారు. వివేకా హత్య కేసుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. కేసును ఛేదించి పోలీసులు నిజాయితీని నిరూపించుకోవాలని తెలిపారు.
tdp
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన నేరస్థులను పట్టుకోవాలని పోలీసులను అడగడంలో తప్పేముందని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. వివేకా హత్య కేసుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని వర్ల ఆరోపించారు. కేసును ఛేదించి పోలీసులు తమ నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బాబాయికి సంబంధించిన కేసులోనే పోలీసులు నేరస్థులను పట్టుకోలేకపోతే... సామాన్యుల కేసుల పరిస్థితేంటని ప్రశ్నించారు.