వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. సీఎం జగన్ చెప్పే ప్రతి మాట వెనుక, అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర దాగి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారన్నారు.
'సీఎం జగన్ ప్రతి మాట, సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర' - పిల్లి మాణిక్యాలరావు తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ చెప్పే ప్రతి మాట వెనుక, అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర దాగి ఉంటుందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని మండిపడ్డారు.
సీఎం జగన్ ప్రతి మాట, సంక్షేమ పథకం వెనుక ఓ కుట్ర
కరోనా నివారణకి ఆనందయ్య ఇచ్చే మందు డబ్బాలపైనా వైకాపా బొమ్మలు వేసుకోవడం సిగ్గుచేటని ఆక్షేపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వ విధానాలను, మోసపూరిత వాగ్దానాలపై నిలదీయాలని సూచించారు.
ఇదీచదవండి:పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం