TDP leader Nara Lokesh Yuvagalam Padayatra: జనప్రభంజనమై సాగుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ ఘనత సాధించనున్న లోకేశ్, తెలుగుదేశం అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీల శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాక తాడేపల్లిలో ఆవిష్కరించనున్నారు. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళానికి ప్రకాశం బ్యారేజీ వద్ద గుంటూరు నేతలు ఆత్మీయ వీడ్కోలు పలకనుండగా, కనకదుర్గమ్మ పాదాల చెంత ఇంద్రకీలాద్రి వద్ద కృష్ణా జిల్లా నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. ఉమ్మడి జిల్లాలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా వైకాపా నుంచి భారీ చేరికలు ఉండేఅవకాశం ఉంది.
యువనేత నారాలోకేశ్యువగళం పాదయాత్ర నేడు ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనుంది. ఇప్పటి వరకూ 187రోజుల పాటు 2496.5కిలోమీటర్ల మేర నడిచిన లోకేశ్ ఇవాళ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి వద్ద 2500కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు. ప్రతీ వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకం ఆవిష్కరిస్తున్న లోకేశ్, ఇవాళ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తనని, పార్టీని గెలిపిస్తే, అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్దీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. నియోజకవర్గంలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తాననే హామీ ఈ సందర్భంగా ఇవ్వనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద నుంచి ప్రారంభించనున్న లోకేశ్ తోలుత కూల్చివేసిన ప్రజావేదిక పరిశీలించనున్నారు. కృష్ణ కరకట్ట మీదుగా తాడేపల్లి సీతానగరం, ప్రకాశం బ్యారేజీల మీదుగా విజయవాడ నగరంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.
Lokesh Defamation Case on Posani: అసత్య ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టను: లోకేశ్
రాజీకయ చైతన్యం కలిగిన ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో నాలుగు రోజులపాటు పాదయాత్ర సాగేవిధంగా ఏర్పాట్లు చేశారు. యువగళానికి విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో నేతలు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తుండగా ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు యత్నిస్తోంది. సభకు స్థలం ఇచ్చే రైతులకు బెదిరింపలు మొదలు పాదయాత్ర మార్గాలకు అనుమతుల కోసం అధికారులు పలు కొర్రీలు పెడుతూ వస్తున్నారు. దాదాపు అయిదారు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగనున్న పాదయాత్ర 6నియోజకవర్గాల మీదుగా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఒక్కరోజే విజయవాడ నగర పరిధిలోని
3నియోజకవర్గాలైన పశ్చిమ, సెంట్రల్, తూర్పుల్లో పాదయాత్ర సాగనుంది. ఈనెల 22న గన్నవరంలో దాదాపు లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలిరోజైన నేడు ప్రకాశం బ్యారేజీ మీదుగా వినాయక గుడి, పోలీసులు కంట్రోల్ రూం, స్వర్ణప్యాలెస్, విజయటాకీస్, సీతారాంపురం సిగ్నల్, చుట్టుగుంట, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఇందిగాంధీ స్టేడియం మీదుగా బందర్ రోడ్డు మార్గంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఎ కన్వెన్షన్ వరకు చేరుకుంటుంది. మొత్తం 8.70 కిలోమీటర్లు నగరంలో పాదయాత్ర సాగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తున్న సీనియర్ నేత కేశినేని శివనాధ్(చిన్ని)కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో రోజైన రేపు(20వ తేదీ) విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా పలు వర్గాల ప్రజలు, కార్మికులు, మహిళలు విద్యార్థులు, వ్యాపారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. వారితో మమేకమై వారి సమస్యలను కూలకుషంగా వింటారు. వారి సమస్యలకు టీడీపీ ప్రణాళికలో స్థానం కల్పించేందుకు కృషి చేస్తారని చెబుతున్నారు. బెంజి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, బందరు రోడ్డు, హైస్కూల్ రోడ్డు, రైతు బజారు జంక్షన్, పంటకాలువ జంక్షన్, సనత్ నగర్ మీదుగా పెనమలూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. కానూరు, తాడిగడప సెంటర్, పోరంకి జంక్షన్ మీదుగా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని నిడమనూరుకు చేరుకుంటుంది. నిడమనూరులో బస ఏర్పాటు చేశారు. 22వ తేదీ గన్నవరంలో బహిరంగ సభ అనంతరం 23న నూజివీడు నియోజకవర్గం మీదుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.